
rana priya - gowry lekshmi h lyrics
రానా ప్రియా చిరు నగవుల సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
రానా ప్రియా మది వనముల ఘుమ ఘుమ సుమమై
రానా ప్రియా మునుపెరగని అనుభవమై
మనసుకే వేకువనై వయసుకే వేసవినై
నువ్వంటే అంటే నేనేరా
నీ వెంటె వెంటై రాలేనా
రానా ప్రియా చిరు నగవుల సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
వెలిగే వెలుగు నువ్వే అయితె వెనకె నీడై రాలేనా
వేసే అడుగు నువ్వే అయితె అడుగుల జాడై రాలేనా
నువు కలవైతే కలవరమవనా
ఆ… నువు కలమైతే కవితై రానా
నేనే ప్రేమై ఈ లోకమే ఆక్రమించనా
రానా ప్రియా చిరు నగవుల సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
రంగు రూపు భాషే లేని భావం మనమై పోదామా
నేడూ రేపూ కాలం లేని తీరం వైపే పోదామా
సెలవులు లేని కొలువులు మనవి
చెరపగ లేని చరితలు మనవి
గతమై పోలే అనుభూతికై స్వాగతించనా
రానా ప్రియా చిరు నగవుల సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
మనసుకే వేకువనై వయసుకే వేసవినై
నువ్వంటే అంటే నేనేరా
నీ వెంటె వెంటై రాలేనా
రానా ప్రియా చిరు నగవుల సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
మను
Random Song Lyrics :
- big steppaz - shunaka lyrics
- ice cypher - gameboyjones lyrics
- underwater - harrison lyrics
- why do you hate me? - raria lyrics
- deti zo stanice 666 - astral one lyrics
- mers 2 - bapelyв lyrics
- serum yanga - glaso sa & cash brown sa lyrics
- mind - erin mopp lyrics
- mi 4 de mayo - pt on the beat lyrics
- nuclear winter - nick sax lyrics