lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

evaru rayagalaru - k. s. chithra lyrics

Loading...

ఎవరు రాయగలరూ…
“అమ్మా” అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ…
“అమ్మా” అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా…
అమ్మేగ తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగ ఆది స్వరం ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరు…
“అమ్మ” అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు…
“అమ్మ” అను రాగం కన్న తీయని రాగం

అవతారమూర్తి అయినా
అణువంటే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే
అంతవాడు అవుతాడు
అవతారమూర్తయినా అణువంటే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా… అమ్మేగ చిరునామా ఇంతటి ఘన చరితకి
అమ్మేగ కనగలదు అంత గొప్ప అమ్మని

ఎవరు రాయగలరు…
“అమ్మ” అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు…
“అమ్మ” అను రాగం కన్న తీయని రాగం

శ్రీరామ రక్ష అంటూ నీళ్ళుపోసి పెంచిందీ
ధీర్ఘాయురస్థు అంటూ నిత్యం దీవించిందీ
శ్రీరామ రక్ష అంటు నీళ్ళుపోసి పెంచింది
ధీర్ఘాయురస్థు అంటు నిత్యం దీవించింది
నూరేళ్లూ… నూరేళ్లు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో

ఎవరు రాయగలరు “అమ్మ” అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు “అమ్మ” అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగ తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగ ఆది స్వరం ప్రాణమనె పాటకి

ఎవరు రాయగలరు “అమ్మ” అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు “అమ్మ” అను రాగం కన్న తీయని రాగం…

Random Song Lyrics :

Popular

Loading...