
chuttu chutti - s. p. balasubrahmanyam feat. harini lyrics
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్లతో ఏదో చూశావా
కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం వేగిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నను తొందర పెట్టగ చూశారు
నీవే నను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందరవదనా తియ్యని వేదన సాగ
విరిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ మూదిరిపోగా
నా చెవిని కొరుకు చెవిని కొరుకు పంటికి
గాయపరుచు గాయపరుచు గాజుకి
ఎదను తాకు ఎదను తాకు కాలికి ముద్దులివ్వనా
నా సొగసు తాగు సొగసు తాగు పెదవికి
మనసు లాగు మనసు లాగు కంటికి
బుగ్గ గిల్లు బుగ్గ గిల్లు గోటికి ముద్దులివ్వనా
అరె తుమ్ము వచ్చినా చీమ కుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులు సోలినా చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగా ఉయ్యాలలూపించకు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నను తొందర పెట్టగ చూశారు
నీవే నను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి వల్లరి సాగ
విరిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు
నే పాలవోలె పాలవోలె పొంగగ
పెరుగువోలె పెరుగువోలె మారగ
తాడు మీద తాడు వేసి అయ్యో చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగ సోలగ
మత్తు వదిలి మత్తు వదిలి లేవగ
చిత్తగించి కొత్త వలపు అయ్యో ఒలికేవా
ముండుటెండలో ఐస్ ఫ్రూట్ లా కరిగే పోకు
చలివేంద్రమా దాహమన్నచో తోసెయ్యకు
హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా అధరానికధరాన్ని అందించ అడ్డెయ్యకు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్లతో ఏదో చూశావా
కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం వేగిపోగా
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి వల్లరి సాగ
విరిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నను తొందర పెట్టగ చూశారు
నీవే నను కొంగున కట్టావు
Random Song Lyrics :
- feels like lightning - josh ritter lyrics
- 20 min freestyle - lee hendrix$on lyrics
- l4 - adey lyrics
- negresa - yung cosmeenelul lyrics
- crazy virgo (interlude) - croosh lyrics
- wooden bag - richard dawson lyrics
- tell me - love-sadkid lyrics
- ride - g herbo lyrics
- was auch immer - musa lyrics
- tesla - playful ryan lyrics