
from "premikula roju" - unni menon, sreekumar & kavita krishnamurthy lyrics
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈ నాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈ నాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
నిన్ను చూసి నన్ను నేను మరిచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా
నిన్ను చూసి నన్ను నేను మురిసి
అసలు మాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
ఓ.కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా
ఓ.కళ్లలోన కాటుక కరిగిపోవునంట
కురులలోన పువ్వులన్నీ వాదిపోవునంట
నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
నా ప్రేమ. నీవేలే
నా ప్రేమ… నీవేలే
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈ నాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈ నాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
ప్రేమ చూపులో ఉంది మహత్యం
ప్రేమ భాషలో ఉంది కవిత్వం
ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం
ప్రేమ సృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం
ఓ . నా మనసె నీలో దాచి ఉంచినాను
ఆ మనసె క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను
ఓ.నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను
నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
నా ప్రేమ. నీవేలే
నా ప్రేమ… నీవేలే
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.
o – o – o – o – o- o – o – o- o- o- o – o- o
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.
o – o – o – o – o- o – o – o- o- o- o – o- o
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.
o – o – o – o – o- o – o – o- o- o- o – o- o
Random Song Lyrics :
- baby - glee lyrics
- de ouvido a ouvido - realidade cruel lyrics
- times change... - nana grizol lyrics
- nada além do meu senhor - felipão lyrics
- deus sabe, deus ouve, deus vê - communion lyrics
- rap do homem macaco - homem macaco lyrics
- sonho de bugio - os serranos lyrics
- vá se converter - banda dopa lyrics
- o nosso bonde é - mc max lyrics
- te abrazo - cristhal picos lyrics