lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lipileni ye kantibaasa - veerabhadra rao lyrics

Loading...

లిపి లేని కంటి బాస. తెలిపింది చిలిపి ఆశా
నీ కన్నుల కాటుక లేఖలలో.
నీ సొగసుల కవితా రేఖలలో.

ఇలా ఇలా చదవనీ నీ లేఖని. ప్రణయ రేఖనీ.ఈ
బదులైన లేని లేఖా. బ్రతుకైన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో.
నీ కవితలు నేర్పిన ప్రాసలతో.
ఇలా ఇలా రాయనీ నా లేఖనీ. ప్రణయ రేఖనీ.ఈ
లిపి లేని కంటి బాస. తెలిపింది చిలిపి ఆశా!!

అమావాశ్య నిశి లో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉందీ వేదన తానై విదియ నాటి జాబిలి కోసం.
వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం… మ్మ్.మ్మ్
లలలల ఆఆ.లలలల ఆఆ.లలలల
ఆఆఆఆ.తనన తనన తనన
వెదుకుతు ఉందీ వెన్నెల తానై.ఒక్క నాటి పున్నమి కోసం

లిపి లేని కంటి బాస. తెలిసింది చిలిపి ఆశా!!

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకునీ.
అ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకునీ
నీ కంటికి పాపను నేనై. నీ ఇంటికి వాకిలి నేనై…
గడప దాటలెకా నన్నే గడియ వేసుకున్నాను.
ఘడియైనా నీవు లేక గడప లేక ఉన్నానూ.

బదులైన లేని లేఖా. బ్రతుకైన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో.
నీ కవితలు నేర్పిన ప్రాసలతో.
ఇలా ఇలా రాయనీ నీ లేఖనీ. ప్రణయ రేఖనీ.ఈ
లిపి లేని కంటి బాస. తెలిపింది చిలిపి ఆశా!!

Random Song Lyrics :

Popular

Loading...