nadiche daarulanni nee pere raasukonnaa - venugopal alli lyrics
వెన్నెల్లో విరబూసే.. మల్లెపువ్వు వలే..
నా.. ఊపిరంతా నింపేసే.. సువాసన ఇదే..
ఈ గాలిలో తేలిపోయే.. పరిమళం వలే… నా మనసంతా.. చుట్టేసే స్పర్శ ఇదే..
నడిచే.. దారులన్నీ…. నీ.. పేరే.. రాసుకున్నా…
నిలిచే.. నీడలన్నీ…. నా తోడే.. అనుకున్నా…
చీకటి దారుల్లో… దీపమై..వెలిగావు..
చెప్పని.. నా ప్రేమని.. చూపులతో తెలిపావు..
ఆగని.. ఊహల్ని అడిగా.. నీలోనే… ఆగమని..
అడుగడుగునా కాలం.. నిన్నే ..గుర్తుచేయమని..
చూపుల్లోనే… మొదలైన… ఆ మౌనకథాననఆ..
నీ.. చూపు.. కలిసాకా ఆఆ..
నవ్వుల్లోనే.. నడిచిందే.. ఓ.. పరిచయానఆ..
నిలిచేలా… నీదాకా ఆ ఆ
నడిచే దారులన్నీ…. నీ పేరే రాసుకున్నా…
నిలిచే నీడలన్నీ…. నా తోడే అనుకున్నా…
ఈ.. రేయిలో.. మెరిసే… ఆ వెన్నెల వలే..
నా.. కలలన్నీ …వెలిగించే.. వెలుగు ఇదే..
ఈ.. మౌనంలో.. మొలిచే.. ఓ.. మాటల వలే..
నా.. లోపలే.. పలికించే.. భావం ఇదే..
నీ.. నామమే.. నా నిద్రలో.. నిండుతుంటే..
ఈ.. జన్మలో.. జరిగినదంతా.. నీదేనులా..
కన్నీటిలో.. కలిసిన.. కవిత్వమైతే…
ప్రతి అక్షరం… ప్రేమగా… రాసుకున్నానులా…
నడిచే దారులన్నీ…. నీ పేరే రాసుకున్నా…
నిలిచే నీడలన్నీ…. నా తోడే అనుకున్నా…
Random Song Lyrics :
- bitterness - melody lz lyrics
- this modern love (demo) - bloc party lyrics
- gaby (bonus track) - tokyo town lyrics
- why hurt? - mide lyrics
- t r i u m p h - horid the messiah lyrics
- zero.shots - selfmxdebless lyrics
- naamari - ibe lyrics
- the tyger - kenneth leighton lyrics
- shelves. - @ajanfm lyrics
- hi jerry - jzac lyrics